Take a fresh look at your lifestyle.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

0 45

(మెట్రో న్యూస్):

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఇంటిగ్రల్ ఫౌండేషన్ స్కూల్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.

దసరా, బతుకమ్మ పండుగ సెలవులకు ముందు నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థినులు, ఉపాధ్యాయుల సందడి మధ్య అంబరాన్నంటాయి.
ఈ సందర్భంగా విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు గునుగు, తంగేడు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి పాఠశాల ప్రాంగణాన్ని పూలవనంగా మార్చారు.

సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థినులు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ సంప్రదాయ పాటలు పాడి ఆటపాటలతో సందడి చేశారు. దీంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.

విద్యార్థుల్లో సాంస్కృతిక విలువల పెంపునకు ప్రాధాన్యం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై నేటి తరం విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేయడమే

ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని పాఠశాల ప్రిన్సిపాల్ సుమయ్య నాజ్నీన్ తెలిపారు. పండుగల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలు పెంపొందించడంతో పాటు మన సంప్రదాయాల పట్ల గౌరవం, అభిమానం పెరుగుతాయని పేర్కొన్నారు.

పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల సమన్వయంతో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.