(మెట్రో న్యూస్)
షట్టర్ వంచి లోపలికి చొరబడి, గ్లాస్ పగలకొట్టి రూ.2 కోట్లకు పైగా విలువైన వజ్రాభరణాలు మాయం
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్‌లో తెల్లవారు జామున భారీ చోరీ జరిగింది. దుండగులు షట్టర్‌ను వంచి దుకాణంలోకి చొరబడి, లోపల ఉన్న గ్లాస్‌ను పగలగొట్టి సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన వజ్రాలకు సంబంధించిన నగలను ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
చోరీ జరిగిన విషయం తెలియడంతో మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. దుండగులు ఎలా వచ్చారు.. చోరీ అనంతరం ఏ మార్గంలో వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చోరీకి సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.