Take a fresh look at your lifestyle.

తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్

0 22

ఢిల్లీ (మెట్రో న్యూస్):

తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అద్వైత్ కుమార్ సింగ్, ఐఏఎస్ (2013) సోమవారం స్వీకరించారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కోఆర్డినేషన్ (కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు & కేంద్ర ప్రాయోజిత పథకాలు) ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న అద్వైత్ కుమార్ సింగ్‌కు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ పదవికి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం.1441, సాధారణ పరిపాలన శాఖ, తేదీ 03.10.2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. రెసిడెంట్ కమిషనర్ బాధ్యతలతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన సమన్వయ బాధ్యతలను కూడా ఆయన కొనసాగించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.