Take a fresh look at your lifestyle.

రెండేళ్ల పదవీ కాలం సంతృప్తి నిచ్చింది మెట్రో ప్రతినిధి తో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

0 3

హైదరాబాద్‌: మెట్రో న్యూస్
తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా తన రెండేళ్ల ప్రస్థానం పూర్తి సంతృప్తి నిచ్చిందని మహేష్‌కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు పార్టీ పనితీరు, సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ,పార్టీ సమన్వయం, భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణపై ఆయన మంగళవారం మెట్రో ప్రతినిధి తో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన నిర్ణయాల్లో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నామని తెలిపారు.టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చామని మహేష్‌కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. మండల, జిల్లా స్థాయి నాయకత్వంతో నిరంతరం సమన్వయం చేస్తూ కార్యకర్తలకు పార్టీ కార్యక్రమాలను చేరువ చేశామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించామని తెలిపారు.
ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయం ఉంటేనే ప్రజలకు మరింత మెరుగైన ఫలితాలు అందుతాయని మహేష్‌కుమార్‌ గౌడ్‌ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకత్వం మధ్య సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తనకు ఎలాంటి వర్గం లేదని, పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన.కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు సహజమేనని పేర్కొన్నారు.
తన నాయకత్వంలో బీసీ వర్గాలకు సంబంధించిన అంశాలను పార్టీ కార్యక్రమాల్లో ప్రధానంగా ప్రస్తావించినట్లు మహేష్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. కులగణన, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ కృషి చేస్తోందన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తన రెండేళ్ల పదవీకాలంలో పార్టీకి వచ్చిన ఎన్నికల ఫలితాలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని తెలిపారు స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టడం, కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడం వంటి అంశాలపైదృష్టి సారించినట్టు తెలిపారు
పార్టీకి అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని, అందరినీ కలుపుకొని కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తామని మహేష్‌కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు.పీసీసీ గా రెండేళ్ల ప్రయాణం ఎంతో ఉత్సాహంగా సాగిందన్నారు కార్యకర్తలకు భరోసా కల్పించి.పార్టీకి బలాన్ని చేకూర్చామన్నారు
పార్టీని బూత్ స్థాయి వరకు బలోపేతం చేశామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డితో నా వేవ్‌లెంగ్త్ మ్యాచ్ అయిందని రెండేళ్లు సాఫీగా పార్టీని ముందుకు తీసుకెళ్లామన్నారు
చిన్నచిన్న ఇబ్బందులు వచ్చినావాటిని అవలీలగా అధిగమించామని
రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, దీపాదాస్ మున్షీ సహకారంతో పార్టీని నడిపామన్నారు
సీఎం రేవంత్ తో కలిసి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమేతమ లక్ష్యమన్నారు
డీలిమిటేషన్ లేకపోతే తెలంగాణలో 17కి 17 లోక్‌సభ సీట్లు గెలిపించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.కుల సర్వేతో తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం జరిగిందని రాహుల్ గాంధీ ఆశయం కుల సర్వేను శాస్త్రీయంగా, సమర్థవంతంగా నిర్వహించినసీఎం రేవంత్‌కు ఆయన ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు కుల సర్వేను కేంద్రం తొక్కిపెట్టడం దురదృష్టకరమని
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కుల సర్వే అమలు చేస్తామని మహేష్ గౌడ్ తెలిపారు
ఏఐసీసీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని బూత్ స్థాయి వరకు తీసుకెళ్లామని
సర్పంచ్ ఎన్నికల్లో 57 శాతం వరకు బీసీలు గెలిచారని మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 50 శాతం సీట్లు ఇచ్చామన్నారు ఏఐసీసీ ఆదేశాలతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికలో కొత్త విధానం అమలు చేశామని
ఢిల్లీ నుంచి అబ్జర్వర్లను పంపించి సమీక్షించిన తర్వాత డీసీసీ అధ్యక్షులను ప్రకటించామని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డితో నాకు ఎక్కడా గొడవ జరగలేదని
పార్టీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ సహజమే నని మహేష్ గౌడ్ తెలిపారు
మా మధ్య గ్యాప్ ఉందని పత్రికల్లో వస్తుందని అలాంటిది ఏమి లేదని గొడవ అసలే లేదన్నారు
ఒకవేళ సీఎం తో అభిప్రాయ భేదాలు వచ్చినా సాయంత్రానికే సరిచేసుకున్నామన్నారు
పార్టీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని
బీసీ మంత్రిని తొలగించినప్పుడు తాను కూడా బాధపడ్డానని మహేష్ గౌడ్ తెలిపారు
మంత్రి గా సురేఖను తొలగించడానికి కారణాలు అందరికి తెలుసని ముఖ్యంగా మీడియా తెలుసన్నారు ఏఐసీసీ నిర్ణయం మేరకే సురేఖపై చర్యలు తీసుకున్నామని
క్రమశిక్షణ తప్పి హద్దు దాటితే ఎవరిపైనా చర్యలు తప్పవన్నారు క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఏఐసీసీ నిర్ణయించిందని తెలిపారు
తాను టీపీసీసీ అధ్యక్షతన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించామని తెలిపారు
రెండేళ్ల ప్రయాణం ఎలాంటి లోటుపాట్లు లేకుండా సాగిందని పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లామన్నారు
ఈ నెలాఖరులోపు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చేస్తామని వీలైనంత త్వరగా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పూర్తి చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు సొసైటీ నియామకాల్లో మండల అధ్యక్షుల నిర్ణయానికే ప్రాధాన్యం ఇచ్చమని
కార్యకర్తల విషయంలో ఎమ్మెల్యేలు కొంత ఇబ్బంది పెట్టినా.. మండల అధ్యక్షుల అభిప్రాయానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు మండల అధ్యక్షుల నిర్ణయానికి ప్రాధాన్యంపై ఏఐసీసీ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నానని తెలిపారు
ఎమ్మెల్యే టికెట్ల విషయంలో డీసీసీ అధ్యక్షుల అభిప్రాయం కీలక మన్నారు

పిఏసీ లో ఎమ్మెల్యే టికెట్ చర్చకు ముందు డీసీసీ అధ్యక్షుడి అభిప్రాయం తీసుకుంటామన్నారు
ఎమ్మెల్యే గా పోటీ చేయాలనుకునే వారు తప్పనిసరిగా డీసీసీ అధ్యక్షుడిని కలవాలన్నారు
నామినేటెడ్ పదవుల భర్తీలోనూ డీసీసీ అధ్యక్షుల అభిప్రాయం తీసుకుంటున్నామని తెలిపారు కాంగ్రెస్‌లో పదవులు కోరుకుంటే రావు.. చేసే పనిని బట్టి పదవులు వస్తాయన్నారు
కేబినెట్‌లో 4,5 మంది బీసీలకు చోటు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు
తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఎవరినీ సంప్రదించలేదని
భవిష్యత్‌లో తెలంగాణకు బీసీ సీఎం అయ్యే అవకాశం కాంగ్రెస్‌తోనే ఉందని తెలిపారు ప్రస్తుతం రేవంత్‌రెడ్డి సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని
ప్రస్తుతం బీసీ సీఎం లేకపోయినా.. భవిష్యత్‌లో ఎప్పుడైనా బీసీ సీఎం కావడం ఖాయమన్నారు
వచ్చే ఎన్నికల్లో నా జిల్లా నుంచే పోటీ చేస్తానని తెలిపారు బీజేపీ కనీసం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బీసీని చేయలేదన్నారు
బీసీ సీఎం చేస్తామంటే బీజేపీని ఎలా నమ్మాలన్నారు
ఏఐ టెక్నాలజీని మంచికంటే చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని
ప్రస్తుతం ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియని పరిస్థితి ఉందని మీడియా ను ఉద్దేశించి తెలిపారు
ఏఐ టెక్నాలజీని బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు తప్పుగా ఉపయోగిస్తున్నాయని తెలిపారు ఇలాంటి రాజకీయాలు ఎక్కువ రోజులు మనుగడ సాగించలేవని తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం మరే రాష్ట్రంలోనూ జరగడం లేదన్నారు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ను గౌరవిస్తానని సీఎంగా కేసీఆర్‌ ఫెయిల్‌ అయ్యారన్నారు
ఫోర్త్ సిటీ రేపోమాపో పూర్తయ్యే సిటీ కాదని
ఫోర్త్ సిటీపై హరీశ్‌రావు వంటి వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు మూసీ ప్రాజెక్టు లక్ష కోట్ల ప్రాజెక్టు కాదని
మూసీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మహేష్ గౌడ్ తెలిపారు
కాంగ్రెస్ గ్రౌండ్‌లో బలంగా ఉందని హైడ్రాపై జరిగిన తప్పుడు ప్రచారాన్నే మూసీపై చేస్తున్నారని
మూసీ పరివాహక ప్రాంతంలో పేదలు నివసిస్తున్నారన్నారు
గతంలో మాదిరిగా వరదలు రాకుండా మూసీ సుందరీకరణ అవసరమన్నారు మూసీ సుందరీకరణతోనే విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని
అబద్ధపు ప్రచారాలకు ఇన్‌స్టంట్ రియాక్షన్స్ వస్తాయని లాంగ్‌రన్‌లో అసలు విషయం బయటపడుతుందన్నారు
22-A ఎక్కడ ప్రారంభమైంది.. ఎవరు తీసుకొచ్చారో పూర్తిగా చదివితే అర్థమవుతుందని
సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం బాధ్యత గా మహేష్ తెలిపారు
ప్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తిది తప్పు కాదని
నిషేధిత జాబితాలో ఉన్న విషయం తెలిసినా వెంచర్ వేసిన వారిపై చర్యలు ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.