Take a fresh look at your lifestyle.

‘ఆయనే మా బలం’.. చిరంజీవి పుట్టినరోజున అన్నా కొణిదెల భావోద్వేగ పోస్ట్‌

0 30
Anna Konidela emotional post on Chiranjeevi birthday He is our strength
  • చిరంజీవిని జ్ఞానం, ప్రేమ, బాధ్యతకు ప్రతీకగా అభివర్ణన
  • కుటుంబం ఆయన సలహాలను ఎంతో విలువైనవిగా భావిస్తుందని వెల్లడి
  • ఏ ఆందోళన పంచుకోవాలన్నా ఆయన దగ్గరకే వెళతామని వెల్లడి
  • పవన్‌, చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన అన్నా కొణిదెల

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ సతీమణి అన్నా కొణిదెల భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు. చిరంజీవిని తమ కుటుంబానికి జ్ఞానం, ఆప్యాయత, ప్రేమ, బాధ్యత కలగలిసిన వ్యక్తిగా అభివర్ణించారు. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ఆయన్నే సంప్రదిస్తామని తెలిపారు.

అన్నా కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్‌ కల్యాణ్‌, చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ‘‘ఆయన జ్ఞానం, ఆప్యాయత, ప్రేమ, బాధ్యత. మేమంతా చూసి నేర్చుకునే వ్యక్తి. సలహా కావాలన్నా, మా ఆందోళనలను పంచుకోవాలన్నా ఆయన దగ్గరకే వెళ్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి’’ అంటూ రాసుకొచ్చారు.

చిరంజీవి 1978లో సినీ రంగ ప్రవేశం చేశారు. తొలినాళ్లలో సహాయ పాత్రలు, ప్రతినాయక పాత్రలు పోషించారు. 1983లో వచ్చిన ‘ఖైదీ’ చిత్రం ఆయన కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచి ఆయనను అగ్ర కథానాయకుడిగా నిలబెట్టింది. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్‌, 2024లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. 2022లో ఐఎఫ్‌ఎఫ్‌ఐ ‘ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.