Take a fresh look at your lifestyle.

తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) నూతన కమిటీ ఎన్నిక..

0 5

మెట్రో ఈవెనింగ్

తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం సన్నాహక సమావేశం ఖమ్మం మున్నూరు కాపు హాస్టల్ నందు నగర అధ్యక్షులు రాపర్తి శరత్ కుమార్ అధ్యక్షతన జరిగింది. నూతన జిల్లా అధ్యక్ష – కార్యదర్శులుగా శెట్టి రంగారావు – గోవింద్ శ్రీనివాసరావు, కోశాధికారిగా మాదంశెట్టి హనుమంతరావును ఎన్నుకోవడం జరిగింది..ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా సీనియర్ నాయకులు మేకల బిక్షమయ్య, మూలగొండ్ల శ్రీహరి,ట్రస్టు బోర్డు చైర్మన్ కనకం జనార్దన్ రావు, కార్యదర్శి కనిశెట్టి నర్సయ్య, రాష్ట్ర నాయకులు కట్ల రంగారావు, భద్రాద్రి కొత్తగూడెం గ్రంధాలయం అధ్యక్షులు పసుపులేటి వీరబాబు, ఏ ఎం సీ చైర్మన్ బండారు నరసింహరావు,సూరంశెట్టి కిషోర్,గాదె లక్ష్మీనారాయణ, పెద్దబోయిన శ్రీనివాసరావు, ఉంగరాల సుధాకర్, చెరుకూరి పూర్ణ, ఎర్రి నరసింహరావు, కటిక కిరణ్, తోట రామారావు, దుగ్గిదేవర నాగేశ్వరరావు, సముద్రాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ముఖ్య అతిథి కనకం జనార్దనరావు మాట్లాడతూ ప్రస్తుత పరిస్థితి లలో ఖమ్మం జిల్లా కాపు సంఘం ఐక్యతకు మీరు, మేము కలిసి కృషి చేయుటకు తగు సలహా సూచనలు ఇచ్చినారు. రానున్న కాలంలో సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు వారు ఏ కమిటీలలో ఉన్నా సంఘ సభ్యత్వం చేసి ట్రస్టు బోర్డు ద్వార ఎన్నిక జరగాలని సూచించారు.
నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు శెట్టి రంగారావు మాట్లాడుతూ ప్రతి గ్రామం ప్రతి మండలం నందు మున్నూరు కాపు కుల బంధువులను కలుపుకొని సంఘం సభ్యత్వంలు చేర్పించి విస్తృతంగా మన సంఘ సభ్యత్వమును బలోపేతం చేసుకోవాలని అందుకు కుల బంధువులందరూ సహకరించాలని కోరారు. ఒక్క రోజు టైంలోనే నేటి సన్నాహక సమావేశంకు ఇంతమంది కుల బంధువులు రావడం చాలా ఆనందంగా ఉన్నదని వారందరికీ ధన్యవాదాలు తెలియచేశారు. రానున్న కాలంలో పేద విద్యార్ధులకు, పేద కుటుంబాలకు అండగా ఉంటుందని రాజకీయాలకు అతీతంగా ఈ కమిటీ మున్నూరు కాపుల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తుందని ఖమ్మం నగరమే కాకుండా జిల్లా మొత్తం తిరిగి మిగతా కమిటీలు పూర్తి చేసుకుంటామని పాత తరం కుల పెద్దలు కీర్తి శేషులు మలిశెట్టి వరదయ్య, కనకం సత్యం, మేకల సంగయ్య,బొమ్మిశెట్టి నారాయణ, రాపర్తి రంగారావు మరియు నిమ్మల శంకరరావు ఆశయ సాధనలో అడుగులు వేస్తూ ఈ కమిటీ ముందుకు సాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో భైరిశెట్టి శ్రీనివాసరావు, గంగశెట్టి శ్రీనివాస్, పెళ్లూరు విజయ్ కుమార్,సి హెచ్ విప్లవ కుమార్, పసుపులేటే ఉపేందర్, వెంకట్ నాయుడు, వెన్న పండు, నితిన్ పసుపులేటి నాగరాజు,వాసంసెట్టి సాయికృష్ణ, చెరుకూరి ఉష, బాసెట్టి శ్రావ్య, నిమ్మల సుకన్య తదితరులు పాల్గొన్నారు.నూతన కమిటీ సభ్యులను పరిచయం చేసి వారికి శాలువాలు కప్పి సన్మానం చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.