Take a fresh look at your lifestyle.

కోదండరాం మౌనం

0 23

హైదరాబాద్ : మెట్రో న్యూస్

ఉద్యమ కాలంలో ప్రజా గొంతుకై శాసించాడు. నీళ్లు, నిధులు, నియామకాలు అని గొంతుచించి తెలంగాణ ఉద్యమం లో పోరాట యోధుడయ్యాడు.కానీ నేడు తెలంగాణ లో అనేక సమస్యల పరిష్కారం కోసం వారు, వీరు అనకుండా అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కినా పలకరింపు కరువయ్యేలా మారిపోయారు. ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్ సోర్స్ సిబ్బంది, ఇతర వర్గాల వారు తమ పెండింగ్ బిల్లుల కోసం ఆందోళన లు చేస్తున్న కన్నెత్తి కూడా చూడడం లేదు.ఆయనే ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి.ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అనేక సమస్యల పై చర్చ తో పాటు ప్రొఫెసర్ కోదండరాం వైఖరిపై కూడా చర్చ జరుగుతోంది.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఛైర్మన్‌గా నాటి ప్రభుత్వాన్ని వణికించి, తెలంగాణ సమాజానికి ఆశాకిరణంగా నిలిచిన కోదండరాం నేడు మౌన ముద్ర దాల్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకున్నారనే తీవ్ర అసంతృప్తి క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యలపై నిలదీయాల్సిన గొంతుక, అధికార పార్టీ విధానాలకు కొమ్ము కాస్తుందంటూ విద్యార్థి, ఉద్యోగ సంఘాలు ఇతర వర్గాల ప్రజలు మేధావుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి .

తెలంగాణ సమాజంలో ఎంఎల్‌సీ కోదండరాం తీరుపై అసంతృప్తి అంతకంతకు పెరుగుతోంది.ప్రజా సమస్యలను వదిలేసి ప్రభుత్వం కొమ్ము కాస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ జన సమితి ఛైర్మన్‌గా ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కోదండరాం పట్ల ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత మరియు అసంతృప్తి అంత కంతకు ఊపందుకుంటుంది, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన కీలక నేతలలో ఒకరిగా పేరుపొందిన ఆయన, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంఎల్‌సీగా పదవి పొందిన తర్వాత పూర్తిగా తన శైలి మార్చుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో ఉద్యోగ ప్రకటనలు, జాబ్ క్యాలెండర్లు, నోటిఫికేషన్లలో ఆలస్యంపై అప్పటి ప్రభుత్వంపై పోరాడిన కోదండరాం, ప్రస్తుతం డీఎస్సీ టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణ మరియు ఫలితాల ఆలస్యంపై నిరుద్యోగ యువత ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని నిరుద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి గతంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను సూటిగా ప్రశ్నించిన ఆయన, ప్రస్తుతం అధికార పార్టీ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలను సమర్థించడం చూసీచూడనట్లు వ్యవహరించడంపై తెలంగాణ సమాజంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాగిన తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం, పదవి దక్కిన తర్వాత ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆకాంక్షలను విస్మరించారనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది.ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రజా గొంతుకగా ఉండాల్సిన ప్రొఫెసర్, గవర్నర్ కోటా కింద ఎంఎల్‌సీ పదవి దక్కించుకున్న తర్వాత పూర్తిగా అధికార వర్గానికి లొంగిపోయారనే టాక్ బలంగా వినిపిస్తోంది.తెలంగాణ సాధనలో ప్రజా ఉద్యమాలకు నేతృత్వం వహించిన మేధావిగా కోదండరాంపై ఉన్న నమ్మకం, నేడు ఆయన తీరు వల్ల సడలిపోతోందని పలువురు పేర్కొంటున్నారు ఉద్యమ శక్తులు, విద్యార్థి సంఘాలు ఇప్పటికైనా ఆయన స్పందించి ప్రజా పక్షాన నిలబడాలని డిమాండ్ చేస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.