Take a fresh look at your lifestyle.

ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలి.

0 3

మెట్రో న్యూస్ :

సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి.

తంగాళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.

తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈసందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, పెట్రోలింగ్ వ్యవస్థ అమలు, రౌడీషీటర్లు, నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందిస్తూ పారదర్శకమైన సేవలు అందించాలని సూచించారు.
ప్రజల్లో భద్రతాభావం కల్పించడంలో విజిబుల్ పోలీసింగ్ కీలక పాత్ర పోషిస్తుందని,అధికారులు,సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తు వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.
గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని, చోరీలు, గంజాయి అక్రమ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.యువత మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా విస్తృత స్థాయిలో గ్రామాల్లో, విద్యాసంస్థలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతిరోజూ వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడంతో పాటు హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ నాగేశ్వరరావు, ఎస్.ఐ అశోక్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.