Take a fresh look at your lifestyle.

ఏఐతో ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం

0 2

హైదరాబాద్ (మెట్రో న్యూస్):-

  • సామాన్యుడి జీవితంలో మార్పే సాంకేతికతకు గీటురాయి
  • ఆదా అయ్యే ప్రతి గంటా పౌరులకే తిరిగి ఇవ్వాలి
  • ‘ఏఐ సాక్షమ్‌’ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ప్రభుత్వ కార్యాలయాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జొప్పించడం గొప్ప కాదని, దానివల్ల సామాన్య పౌరుడికి ఏమేరకు మేలు జరుగుతోందన్నదే అసలైన విజయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంతో ప్రభుత్వ పాలనలో వేగం, పారదర్శకత పెరగాలని. పనుల కోసం రైతులు, పింఛనుదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో ప్రణాళికా శాఖ, టీజీ మ్యాథ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఏఐ సాక్షమ్‌’ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు సాంకేతికతతో ఆదా చేసే ప్రతి గంట సమయాన్ని ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే వెచ్చించాలని, ప్రతికూల ఫలితాలు రాకుండా నిరంతరం మానవ పర్యవేక్షణ ఉండాలని తేల్చిచెప్పారు.అధికారిక లావాదేవీల్లో ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, ఆర్థిక క్రమశిక్షణ సాధించేందుకు ఏఐ విశ్లేషణలు దోహదపడతాయని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే ప్రణాళికా రంగంలో కేవలం సగటు గణాంకాలను చూసి సంతృప్తి చెందకూడదని, మారుమూల ప్రాంతాల అర్హులకు కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ సాంకేతికతను వాడుకోవాలని సూచించారు. విద్యుత్ రంగానికి సంబంధించి ముందుగానే డిమాండ్‌ను అంచనా వేయడం, సాంకేతిక లోపాలను గుర్తించడం ద్వారా రైతులు, చిన్న పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందించవచ్చన్నారు. ఐతే ఏఐ ఇచ్చే డేటాను గ్రైండ్ చేయకుండా, క్షేత్రస్థాయి పరిశీలనలు లేకుండా నిర్ణయాలు తీసుకోవద్దని, ఉద్యోగుల అనుభవానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.ప్రజల నుంచి సేకరించే వ్యక్తిగత సమాచార భద్రత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని భట్టి హెచ్చరించారు. అనుమతి లేని ఏఐ సాధనాల్లో ప్రభుత్వ సమాచారాన్ని నమోదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తప్పుడు సమాచారం రికార్డుల్లోకి ఎక్కితే దానికి సంబంధిత అధికారులదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. ఏఐ కేవలం ముసాయిదాలు తయారు చేసేందుకు మాత్రమేనని, తుది నిర్ణయాలు, ఉత్తర్వుల జారీలో మానవ పర్యవేక్షణ తప్పనిసరని స్పష్టం చేశారు. ప్రతి శాఖలోనూ చిన్న ప్రయోగాలతో మొదలుపెట్టి, ఫలితాల ఆధారంగానే విస్తరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్లానింగ్ సెక్రెటరీ గౌరవ్ ఉప్పల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, టీజీ మ్యాథ్ ఎం.డి పూజ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.