Take a fresh look at your lifestyle.

అమరవీరుల స్ఫూర్తితో.. 400 మంది ప్రాణదాతలు

0 6

(మెట్రో ఈవినింగ్స్):

– వేములవాడలో మెగా రక్తదాన శిబిరం
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి గితే అభినందనలు

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వేములవాడలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. మహా లింగేశ్వర్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో సుమారు 400 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి.గితే శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ సేవాభావంతో రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమరవీరుల త్యాగాలు సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఎస్పీ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రక్తం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకుండా స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు రావాలని కోరారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.