Take a fresh look at your lifestyle.

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్‌డిపిఎస్ కేసులపై విస్తృత సమీక్ష

0 3

మెట్రోన్యూస్

* హాజరైన నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ గిరిధర్, సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) కేసులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుండి విచ్చేసిన తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఈగిల్ టీమ్) ఎస్పీ గిరిధర్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆధ్వర్యంలో కమిషనరేట్ పోలీస్ అధికారులతో కలిసి పెండింగ్‌లో ఉన్న ఎన్‌డిపిఎస్ కేసుల పురోగతిపై సమగ్ర సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ గిరిధర్ మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను పరిశీలించి, దర్యాప్తులో కేసులు పెండింగ్‌లో ఉండటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దర్యాప్తు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు:
* డ్రగ్ పెడ్లర్లపై దృష్టి: గంజాయి సరఫరా చేసే ప్రధాన పెడ్లర్లపై నిరంతర నిఘా ఉంచాలని, వారి సరఫరా వ్యవస్థను పూర్తిగా ఛేదించాలని ఆదేశించారు.

* చట్టాలపై పూర్తి అవగాహన: దర్యాప్తు అధికారులు ఎన్‌డిపిఎస్ చట్టాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, సరైన ఆధారాలతో పకడ్బందీగా ఛార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు.

* విద్యార్థులకు అవగాహన

: యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా కళాశాలలు, విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు.

* డీ-అడిక్షన్ కేంద్రాలపై నిఘా:
కమిషనరేట్ పరిధిలోని డీ-అడిక్షన్ కేంద్రాలు, అందులోని వ్యక్తుల కదలికలపై పూర్తి స్థాయి నిఘా కొనసాగించాలని ఆదేశించారు.
సమావేశంలో గంజాయి వినియోగదారులకు (కన్స్యూమర్లకు) ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, ఎదురయ్యే అనర్థాలను సీపీ, ఎస్పీలు వివరించారు. కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, “కరీంనగర్ కమిషనరేట్‌ను మాదకద్రవ్య రహిత (డ్రగ్ ఫ్రీ) కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తాం” అని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో కమిషనరేట్ ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, మాధవి, ఈగల్ ఏసీపీలు ఉపేందర్, సోమనాథ్, పుష్పన్ కుమార్, సీఐలు, ఎస్సైలు మరియు దర్యాప్తు అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.