హైదరాబాద్ (మెట్రో న్యూస్):

తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల జీవన విధానాన్ని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు సేవలను చిరస్మరణీయమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆ మహనీయుడి సేవలు మనమంతా స్మరించుకోవాలన్నారు. ప్రజల గొంతుకగా నిలిచిన కాళోజీ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ప్రజా ప్రభుత్వం సారధ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ భాషకు కాళోజీ చేసిన సేవలు శ్లాఘణీయమని… ఆయన స్ఫూర్తితో తెలంగాణ భాష, సాహిత్యానికి మరింత ప్రోత్సాహం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.