Take a fresh look at your lifestyle.

మనది పేగు బంధం కాదు..! పేరు బంధం

0 6

(మెట్రో న్యూస్) :

మనది పేగు బంధం కాదు..! పేరు బంధమని వ్యవస్థాపక అధ్యక్షులు వుట్కూరి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కోరుట్ల లోని జి ఎస్ గార్డెన్ లో తెలంగాణ శ్రీనివాసుల సేవ సంస్థ ఆధ్వర్యంలో శ్రీనివాసుల మిత్రుల తృతీయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు వుట్కూరి శ్రీనివాస్. మట్లాడుతూ, నాకు వచ్చిన ఆలోచనతో 10 మందితో ప్రారంభించి 50 వేల శ్రీనివాసులతో మమేకమవడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమని ఆయన ఉద్వేగంతో అన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారిని, ప్రతీ శ్రీనివాస్ పేరు గల వ్యక్తి రక్తదానం చేసి కాపాడాలనే ధృఢ సంకల్పంతో మా ఈ శ్రీనివాసుల సేవ సంస్థను 0రాంభించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. శ్రీనివాస్ సేవా సంస్థ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు సేవలందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఎల్.ని.నో ప్రభావంతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని, నీటి ఎద్దడిని నివారించడానికి మా సంస్థ ద్వారా తగు చర్యలు చేపట్టాలన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదని అలాంటి రైతన్న శ్రేయస్సుకు మనమంతా ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ముందుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కాగా ఈ వేడుకల్లో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీనివాసులను ఎంతగానో అలరించాయి. అలాగే జగిత్యాల జిల్లాకు చెందిన యూట్యూబర్ చంద్రగిరి శ్రీనివాస చారి వేంకటేశ్వరస్వామి వేశాధారణ, అన్నమయ్య చింత శ్రీనివాస్ ల వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకలకు ప్రత్యేకంగా నిర్మల్ నుండి వచ్చిన బాలిక పసులోటి వన్షిక భరత నాట్య కళాకారిణి వచ్చి 10 నిమిషాల నాట్యంతో అందరినీ అబ్బిరపరిచింది. ఆ అమ్మాయికి నాట్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తో పాటు, స్వర్ణగిరి నది అవార్డు, నాట్య మయూరి అవార్డు, భారతదేశంలోని అయోధ్య, సింహాచలం, పూరిజగన్నాథ్, అరుణాచలం, స్వర్ణగిరి వంటి క్షేత్రాలలో ప్రశంశలు అందుకుంది. ఆమె నృత్యం అనంతరం శ్రీనివాసుల సేవ సంస్థ నుండి శాలువాతో ఆమెను, ఆమె తల్లి ప్రియాంక, డాన్స్ మాస్టర్ నవ్య వినయ్ కుమార్ లను శాలువాతో సత్కరించారు. రాష్ట్రంలోని శ్రీనివాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పడిగెల శ్రీనివాస్‌, సీనియర్ పాత్రికేయుడు బట్టు హరికృష్ణ, ఆర్గనైజర్లు నీలి శ్రీనివాస్, బెజ్జంకి శ్రీనివాస్ రావు, చెన్నమనేని శ్రీనివాస్ రావు, బెజ్జారపు శ్రీనివాస్, పోతుగంటి శ్రీనివాస్, ముదుల్కర్ శ్రీనివాస్ లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీనివాసుల మిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.