Take a fresh look at your lifestyle.

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

0 2

(మెట్రోన్యూస్):

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రంలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసిల్దార్ కనకయ్య హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకోవడం గర్వంగా ఉందనీ, ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనదని, ఈవృత్తి ద్వారానే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు.
నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం కేవలం ఉపాధ్యాయులకే ఉందన్నారు. అనంతరం మండలంలోని 25 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో ఎంఈఓ జయప్రద, సర్పంచ్ ఆకవరం భవాని, పాక్స్ చైర్మన్ చిటుమల్ల రవీందర్,ఉప సర్పంచ్ విజయలక్ష్మి,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.