త్రేతాయుగంలో శ్రీరాముడు స్థాపించిన అనేక శివాలయాల్లో తాళ్లపాకలోని సిద్ధేశ్వరస్వామి ఆలయం కూడా ఒకటి. శ్రీరాముని తర్వాత తాళ్లపాకలోని శివుడు ఎందరో ఋషులు సిద్ధుల పూజలందుకున్నాడు. అందుకే ఈ స్వామికి సిద్ధేశ్వరస్వామి అని పేరు వచ్చింది.
సిద్దేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు మన దేశంలో అనేక ప్రాంతాల్లో పరమేశ్వరునికి ఆలయాలున్నాయి. ప్రాచీనకాలం నుంచి ఎందరో దేవతలు, ఋషులు శివుని లింగరూపంలో పూజించారు. వీటిల్లో అనేక శివాలయాలు శ్రీరాముడు నిర్మించారని అంటారు. అలాంటి శివాలయాల్లో తాళ్లపాకలోని సిద్దేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఋషులు, సిద్ధులచే పూజలందుకున్నందున ఈ శివుని సిద్ధేశ్వరుడని అంటారు. సెప్టెంబర్ 2, బుధవారం నుంచి తాళ్లపాక శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సిద్దేశ్వర స్వామి ఆలయం ఎక్కడుంది?
కడప జిల్లా రాజంపేట పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో తాళ్లపాక గ్రామం ఉంది. ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ అన్నమాచార్యుని జన్మస్థలమైన తాళ్లపాక గ్రామాన్ని పూర్వం తాటిపాక అని పిలిచేవారం! కాలక్రమేణా ఈ తాటిపాకనే తాళ్లపాకగా మారింది. ఈ గ్రామంలో త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్టించిన సిద్దేశ్వర స్వామి ఆలయం వెలసి ఉంది.
స్థల పురాణం
త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాస సమయంలో సీతా లక్ష్మణులతో కలిసి ఈ ప్రదేశాన్ని సందర్శించారం! సీతాదేవి ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధురాలై కొంతకాలం ఇక్కడే ఉండాలని కోరిందం! అందుకు అంగీకరించిన శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి ఇక్కడ కొంతకాలం నివసించాడం! నిరంతరం పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉండే శ్రీరాముడు తన నిత్యపూజలు కోసం ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించాడం! శ్రీరాముడు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాక ఋషులు, సిద్ధులు ఈ శివలింగాన్ని పూజించారం! అందుకే ఈ స్వామిని సిద్దేశ్వర స్వామి అంటారు.
అదృశ్యమైన శివలింగం:
కలియుగం ప్రారంభంలో హఠాత్తుగా ఈ శివలింగం అదృశ్యమైంది. ఆ సమయంలో తీర్థయాత్రలు చేస్తున్న కొందరు సిద్ధులు, సత్పురుషులు ఈ ప్రాంతానికి వచ్చి, చెట్లు, పొదలతో చుట్టి ఉన్న శివలింగాన్ని గుర్తించారు. వెంటనే వారు ఆ పరిసరాలన్నీ శుభ్రపరచి, అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి, శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు ప్రారంభించారు.
అన్నమయ్య వంశీయులే అర్చకులు:అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారని తెలుస్తోంది. కాలక్రమేణా కాకతీయ, విజయనగర చక్రవర్తులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉంది. తాళ్లపాక అన్నమయ్య తాతలు, పూర్వీకులు, తండ్రులు ఈ ఆలయంలో అర్చకులుగా ఉండేవారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది.
ఆలయ విశేషాలు:
విశాలమైన ప్రాంగణంలో వెలసి ఉన్న సిద్దేశ్వర స్వామి ఆలయం తూర్పు అభిముఖంగా ఉంది. గర్భాలయంలో శ్రీ సిద్దేశ్వర స్వామి లింగ రూపంలో కొలువై ఉన్నారు. గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు, ధ్వజస్తంభం, బలిపీఠం ఉన్నాయి. అలాగే అంతరాలయంలో ఉత్సవమÖర్తులను కూడా దర్శించుకోవచ్చు.
ఉపాలయాలు:
ఆలయ ముఖ మండపంలో సిద్ధేశ్వరస్వామి దేవేరికి ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయంలోనే దక్షిణాభిముఖంగా కామాక్షి దేవి వెలసి ఉంది. అలాగే ముఖమండపంలో మహా గణపతి, సిద్ధి గణపతి, దక్షిణామÖర్తి, వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వంటి దేవి దేవతలు కూడా దర్శించుకోవచ్చు.
తలనొప్పి తగ్గించే వేక తాతయ్య:
ముఖమండపంలో వేక తాతయ్య విగ్రహాన్ని చూడవచ్చు. ఈ విగ్రహం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. గతంలో ఈ ప్రాంతంలో వేక తాతయ్య అనే ఋషి నివసించేవాడు. ఒకసారి ఆయనకు భరించలేని తలనొప్పి వచ్చింది. ఎన్నో చికిత్సలు చేసినా ఆయన తలనొప్పి తగ్గలేదు. ఆ నొప్పి తట్టుకోలేక ఆయన సిద్దేశ్వర స్వామి సన్నిధిలో తల పగులగొట్టుకోవాలని అనుకున్నాడు. అప్పుడు స్వామి వారు ప్రత్యక్షమై ఆయన తలనొప్పి తగ్గించాడని ఆలయ పురాణం ద్వారా తెలుస్తోంది.