(మెట్రో న్యూస్) :
సంగారెడ్డి పట్టణంలోని చెరువు కట్టపై జరుగుతున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పరిశీలించారు. నిమజ్జనానికి ఏర్పాటు చేసిన క్రేన్లు, లైటింగ్, ఇతర సౌకర్యాలను ఆయన పరిశీలించి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు జగ్గారెడ్డి క్రేన్‌పైకి ఎక్కి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులతో మాట్లాడి, వారికి అవసరమైన సౌకర్యాలు, ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని జగ్గారెడ్డి సూచించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ ఉన్నారు.