అయోధ్య మందిరానికి 4 కోట్ల చెక్కు
ఇంటర్నెట్ డెస్క్: అయోధ్యలోని రామమందిర విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు జరుగుతోన్న వేళ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈ ఆలయానికి ఓ భక్తురాలు ఇచ్చిన రూ.4కోట్ల చెక్కు బౌన్స్ అయ్యింది. దానికి కారణం తెలుసుకుని ట్రస్టు సిబ్బంది కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే..

ఇటీవల చెన్నైకి చెందిన ఓ భక్తురాలు అయోధ్య రామాలయాన్ని సందర్శించారు. రామమందిర సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు రూ.4 కోట్ల చెక్కును రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేశారు. విడిగా ఆలయ అభివృద్ధికి రూ.10వేల నగదును విరాళంగా ఇచ్చారు. ఈ క్రమంలోనే డబ్బు డ్రా చేయడానికి ట్రస్ట్ సిబ్బంది బ్యాంక్‌ను సంప్రదించారు. కానీ, ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో ఆరా తీయగా సదరు మహిళ ఖాతాలో కేవలం రూ.3 బ్యాలెన్స్ ఉన్నట్లు చూసి సిబ్బంది షాక్ అయ్యారు.