Take a fresh look at your lifestyle.

ప్రజా సేవే లక్ష్యంగా పిల్లుట్ల రఘు బి ఆర్ ఎస్ పార్టీతో మరింత ప్రజా సేవలో!

0 6

మెట్రో న్యూస్:
హుజూర్నగర్ నియోజకవర్గ బారాస నాయకుడు పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 400 వినాయక విగ్రహాలను రెండు రోజుల పాటు ఉచితంగా పంపిణీ చేశారు. పాలకీడు మండల పరిధిలోని అనేక గ్రామాలకు విగ్రహాలు అందించి . యువతలో ఆధ్యాత్మికతను ప్రోత్సహించారు.యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ధర్మ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.

ఆరు సంవత్సరాలుగా ప్రజాసేవ

“గత ఆరు సంవత్సరాలుగా హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలకు తన వంతుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తువస్తున్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన పిల్లుట్ల రఘు ఈ సారి ప్రధాన పార్టీ బిఆర్ఎస్ నుండి ప్రాతినిధ్యం వహించడం విశేషం. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు, ముఖ్యంగా యువతకు అండగా ఉండాలనే సంకల్పంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాననీ ఆయన పలు సందర్భాల్లో తెలిపారు.

యువతకు అండగా

నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో భాగంగా దాదాపు నాలుగోసారి 400 వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు.యువతలో భక్తి భావాలను పెంచాలన్నదే తన ఉద్దేశం అన్నారు. గతంలో పలు పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇప్పించమని అందించా మని గుర్తుచేశారు.

బిఆర్ఎస్ లో చేరికతో ప్రజలకు మరింత దగ్గరగా

బిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత హుజూర్నగర్ నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాల వివాహాలకు “మేనమామ పెళ్లి కానుక”గా ఉచిత కిట్లు అందించడంతో పాటు, ఆపదలో ఉన్న కుటుంబాలకు, మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రజలకు మరింత దగ్గరగా ఉండే అవకాశం వచ్చిందన్నారు.

అనేక గ్రామాల్లో దేవాలయాల అభివృద్ధి

*గత ఆరు సంవత్సరాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 30 దేవాలయాలకు సహకారం అందించారు, అనేక గ్రామాల్లో బొడ్రాయి కార్యక్రమాలకు అండగా నిలిచారు.
కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సేవ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.