Take a fresh look at your lifestyle.

ఇటుకాలపల్లి టు మేడపల్లి, ఆసరవెల్లి రోడ్డు మరమ్మత్తులు వెంటనే ప్రారబించాలని తదితర శాఖలకు వినతి పత్రం

0 6

మెట్రో న్యూస్:

ఇటికాలపల్లి నుండి మేడపల్లి ఆసరవెల్లి వరకు ఉన్న 7 కిలోమీటర్ల రహదారి పూర్తిగా దెబ్బతిన్నది. స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఈ రోడ్డు నిర్మాణం కొరకు 6 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు సాంక్షన్ చేసి మొబైల్ శిలాఫలకాలతోటి శంకుస్థాపన చేసి 15 నెలలు గడిచిన రోడ్డు మరమ్మతులకు నోచుకోలేదు.నాలుగు గ్రామాల ఏజెన్సీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీనిపై అధికారులతో సమీక్ష చేసి రోడ్డుపనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఏజెన్సీ గ్రామ ల సర్పంచులు ఆధ్వర్యంలో నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిన అందుబాటులో లేకపోవడంతో నర్సంపేట ఆర్డిఓ కి,ఆర్ అండ్ బి నర్సంపేట, ఎమ్మార్వో నల్లబెల్లి, ఎంపీడీవో నల్లబెల్లి, అధికారులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడపల్లి సర్పంచ్ అర్రెమ్ సాంబయ్య రాంపురం సర్పంచ్ పురం భాస్కర్ గొల్లపల్లి సర్పంచ్ బాదావత్ మంజుల మంగీలాల్ మేడపల్లి మాజీ సర్పంచ్ లావుడియా తిరుపతి, గాదం రాజకుమార్ బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు నడిబొట్టు వెంకన్న, వార్డు మెంబర్ పాడియా బద్రు, తదితరులు పాల్గొని వినతి పత్రాలు సమర్పించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.