Take a fresh look at your lifestyle.

గణేష్ మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలి ఎస్ఐ : మాడ శ్రీధర్ రెడ్డి

0 3

గణేష్ మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్ ఐ మాడ శ్రీధర్ రెడ్డి సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఉమ్మడి మేడిపల్లి మండలాల వివిధ గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులతో, మేడిపల్లి మండలకేంద్రంలో ని స్థానిక పోలీస్ స్టేషన్ లో మేడిపల్లి ఎస్సై మాడ శ్రీధర్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు మండలాల రెవెన్యూ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ పాల్గొని మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మండపాల వద్ద ఏ విధమైన చిన్న సంఘటనలు జరిగిన నిర్వాహకులపై కేసులు పెడతామని, భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు.

మండపాల వద్ద అసాంఘిక కార్యక్రమాలైనా పేకాట, మద్యపానం సేవించడం, అశ్లీల డాన్సులు చేయడం వంటి కార్యక్రమాలు చేయకూడదని అన్నారు. మండపాల ప్రాంతంలో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని తెలిపారు. మండపాల నిర్వాహకులతో వాట్స్అప్ గ్రూప్ క్రియేషన్ చేసి నిరంతరం పర్యవేక్షిస్తామని అన్నారు. మండపాల ప్రాంతంలో రాత్రి వేళల్లో ఇద్దరు నిర్వాహకులు పర్యవేక్షించాలని అన్నారు. మండపాల వద్ద ఏ విధమైన ఇబ్బంది జరిగిన డయల్ 112, విపిఓ లకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మేడిపల్లి భీమారం మండలాల సబ్ ఇంజనీర్ లు సతీష్, హరి ప్రసాద్ లు, ఆర్ ఐ మంగి నాయక్, సీనియర్ అసిస్టెంట్ రాజలింగం, షబానా లు, మేడిపల్లి గ్రామ సర్పంచ్ మకిలి దాసు, ఉపసర్పంచ్ అర్జున్, వివిధ గ్రామాల గణేష్ మండపాల నిర్వహకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.