Take a fresh look at your lifestyle.

ఇల్లు ప్రతి పేద కుటుంబం సొంత కల అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు

0 22

మెట్రో న్యూస్, (సెప్టెంబర్ 03)సూర్యాపేట ప్రతినిధి: ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతీ ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది అన్నారు.
గురువారం సూర్యాపేట మండలంలోని రాజనాయక్ తండ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి తో కలిసి భూక్య దేవి వెంకన్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, సర్పంచ్ లూనావత్ శాంత బాయి పాండు నాయక్, ఉప సర్పంచ్ భూక్యా నాగి లోక నాయక్, సీనియర్ నాయకులు పాండు నాయక్, సుక్కో, శంకర్, సురేష్, రవీందర్, కిషన్ నాయక్, చివ్వేంల మండల పార్టీ అధ్యక్షుడు దారావత్ వీరన్న నాయక్, మున్సిపల్ కౌన్సిలర్ చిలుముల సునీల్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుగులోతు నాగు నాయక్, పడిదల రవి, గుంటూరు చిట్టిబాబు, దుబ్బాక ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.