Take a fresh look at your lifestyle.

మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలి

0 16

పనులు బంద్ చేసి మున్సిపల్ కార్మికుల ధర్నా

వికారాబాద్, మెట్రో న్యూస్ :
రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ మున్సిపల్ కార్మికులు గురువారం పనులు బంద్ చేసి BJR చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న యూనిఫాంలు, సబ్బులు, నూనెలు, బట్టలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటంతో పనిభారం పెరుగుతోందని, అదనపు కార్మికులను నియమించి పనిభారం తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్మికుల సమస్యలను ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

ధర్నాలో CITU జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మహిపాల్, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, బుచ్చయ్య, జంగమ జ్యోతి, ఆశ, రాములు, రాజు, వెంకటయ్య, లచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.