IND vs SL : కొలంబో టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. రెండో రోజే రెండు కీలక వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టిన టీమిండియాకు.. మూడో రోజు తొలి సెషన్‌లోనే ప్రసిధ్ కృష్ణ(2-29) బ్రేకిచ్చాడు.

IND vs SL : కొలంబో టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. రెండో రోజే రెండు కీలక వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టిన టీమిండియాకు.. మూడో రోజు తొలి సెషన్‌లోనే ప్రసిధ్ కృష్ణ(2-29) బ్రేకిచ్చాడు. ఓపెనర్ కమిల్ మిశార(19)ను ప్రసిధ్ పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం కమిందు మెండిస్(10 నాటౌట్), పసిందు సూర్యబండార(32 నాటౌట్) ఆచితూచి ఆడుతున్నారు.
భారీ స్కోర్‌తో తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత జట్టు కొలంబో టెస్టుపై పట్టు సాధిస్తోంది. 503జ9 వద్ద ఇన్నింగ్స్ ఆపేసి.. శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించడమే ఆలస్యం బౌలర్లు వికెట్ల వేట మొదలెట్టారు. రెండో రోజే లహిరు ఉడార వికెట్ తీసిన ప్రసిధ్ కృష్ణ(2-29).. మూడో రోజు తొలి సెషన్‌లోనే పంజా విసిరాడు.
క్రీజులో పాతుకుపోతున్న కమిల్ మిశార(19)ను బోల్తా కొట్టించాడు. ప్రసిధ్ ఓవర్లో మిశార వికెట్ కీపర్ జురెల్ చేతికి చిక్కాడు. దాంతో 35 వద్ద మూడో వికెట్ కోల్పోయింది లంక. ప్రస్తుతం కమిందు మెండిస్(10 నాటౌట్), పసిందు సూర్యబండార(32 నాటౌట్) వికెట్ కాచుకొని.. భాగస్వామ్యం నిర్మించే పనిలో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు ఇంకా 434 పరుగులు వెనకబడి ఉంది.