Take a fresh look at your lifestyle.

గజ్వెల్ దగ్గర ఎర్రవల్లి సమీపంలో కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి దృశ్యాలు

0 1

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద డప్పుల మోతకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా తరలి వచ్చి డప్పులు మోగిస్తూ నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. నర్సారెడ్డి ఆధ్వర్యంలో వరదరాజపూర్‌మీదుగా కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ సమీపంలోకి కాంగ్రెస్‌ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఎక్కిడికక్కడ కాంగ్రెస్‌ శ్రేణులను బారికేడ్లు, రోప్‌ పార్టీతో పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు అర కిలోమీటరు దగ్గర్లోకి వెళ్లి డప్పుల మోతతో నిరసన తెలిపారు. పోలీసులు స్పందించి వెంటనే నిరసనకారులను వెనక్కి తీసుకొచ్చారు. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఒక దశలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి బారికేడ్లు తోసుకుని ఫాంహౌస్‌ వైపునకు పరుగులు తీశారు. మరో వైపు మర్కుక్‌ వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు మోహరించాయి. ఫాంహౌస్‌ సమీపంలో రైతు దీక్ష పేరుతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి ఎర్రవల్లి పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.

కేటీఆర్, హరీష్ రావులను అడ్డుకున్న పోలీసులు

ఎర్రవల్లి ఫాంహౌస్ వద్ద భారీగా డప్పుల మోతతో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ ఎస్సీ నేతలు సిద్ధమవ్వగా.. ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాంగ్రెస్ శ్రేణులను నిర్బంధిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయల్దేరిని కేటీఆర్, హరీష్ రావుల కాన్వాయ్ లతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హకీంపేట వద్ద వాహనాలను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము కేసీఆర్ ను కలిసేందుకు వెళ్తున్నామని, నిరసనలకు కాదని చెప్పినా పోలీసులు వాహనాలను అనుమతించలేదు. దీంతో వాహనాలు దిగి.. కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ తదితరులు నడుచుకుంటూనే ఫాంహౌస్ వైపు పయనమయ్యారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, పద్మశాలి కార్పోరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ లతో పాటు వందలాది మంది కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.