Take a fresh look at your lifestyle.

అగ్నిప్రమాదంలో 15 మంది పసికందుల మృతి

0 19

అగ్నిప్రమాదంలో 15 మంది పసికందుల మృతి:     

Islamabad hospital | పెను విషాదం.. ఆస్ప‌త్రిలో అగ్నిప్ర‌మాదం.. 15 మంది ప‌సికందుల దుర్మ‌ర‌ణం..!

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రఖ్యాత ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 15 మంది నవజాత శిశువులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్) ఆసుపత్రిలో జరిగింది.
బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఆసుపత్రిలోని గైనకాలజీ వార్డుకు అనుబంధంగా ఉన్న నర్సరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. నర్సరీలోని ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాద సమయంలో నర్సరీలో మొత్తం 16 మంది పసికందులు
ఉండగా, కేవలం ఒక్క శిశువును మాత్రమే సిబ్బంది కాపాడగలిగారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అనంతరం కూలింగ్ ఆపరేషన్స్ చేపట్టాయి. మృతుల సంఖ్యపై తొలుత కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు 14 మందిగా పేర్కొన్నప్పటికీ, స్థానిక మీడియా, ఆసుపత్రి వర్గాలు 15 మంది శిశువులు మరణించినట్లు ధ్రువీకరించాయి.

Leave A Reply

Your email address will not be published.