Take a fresh look at your lifestyle.

పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

0 18

హనుమకొండ జిల్లా బ్యూరో చీఫ్ మెట్రో ఈవినింగ్ న్యూస్ సెప్టెంబర్ (3 ): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలో ఉన్న సాయిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి గురువారం ప్రారంభించారు. ముందుగా ఉన్నత పాఠశాలలో, తదుపరి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఇడ్లీ సాంబార్ తో ఉన్న అల్పాహారాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారనే వివరాలను ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.


ప్రాథమిక పాఠశాలకు ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్ వచ్చిందా అని, రెమెడియల్ తరగతులు నిర్వహిస్తున్నారని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాపురావును కలెక్టర్ అడిగారు. ఎఫ్ఎల్ఎన్ వర్క్ బుక్ ను కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం పాఠశాలల ప్రాంగణంలోనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఎంతమంది చిన్నారులు హాజరయ్యారని కలెక్టర్ ఆరా తీశారు. అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులతో కలెక్టర్ మాట్లాడుతూ… రైమ్స్ వచ్చా అని, చార్టు, గోడలపై వేసిన పక్షులు, జంతువులు బొమ్మలను చూపిస్తూ వాటి పేర్లు చెప్పాలని అనగా చిన్నారులు వాటి పేర్లను తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అడాలి లక్ష్మి, డీఈవో గిరిరాజు గౌడ్, తహసిల్దార్ బావ్ సింగ్, ఎంఈఓ శ్రీదేవి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రశాంతి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ రమాదేవి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.