హైదరాబాద్ (మెట్రో న్యూస్):
- ‘మిలాద్ ఉన్ నబీ’ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకునే ఈ పవిత్ర దినం ముస్లింలకు ఎంతో విశిష్టమైనదని పేర్కొన్నారు.
- ప్రవక్త మహ్మద్ బోధించిన శాంతి, ప్రేమ, సోదరభావం, కరుణ, మానవత్వం, ధర్మబద్ధమైన జీవన విధానం సమాజానికి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన సందేశాలు ప్రపంచ శాంతి, సామరస్యానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
- ముస్లిం మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా పాలనలో తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని సీఎం స్పష్టం చేశారు. ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. మిలాద్ ఉన్ నబీ ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సంతోషం, సౌభ్రాతృత్వాన్ని నింపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.