Take a fresh look at your lifestyle.

పట్టణంలోని గుంటలు పడిన రోడ్లను మరమ్మతులు చేయండి

0 17

కమీషనర్ కు వినతిపత్రం సమర్పించిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు:

జగిత్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 03 (మెట్రో న్యూస్) : జగిత్యాల పట్టణంలోని గుంటలు పడిన రోడ్లను మరమ్మతులు చేయండని మున్సిపల్ కమీషనర్ కు విశ్వ హిందూ పరిషత్ నాయకులు వినతి పత్రం అందజేశారు. గురువారం, గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని గణేష్ మండపాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్, గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ మండపాల వద్ద మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్, లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా మారడంతో భక్తులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గణేష్ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని గుంతలు పడిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు సురక్షితమైన రహదారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గణేష్ మండపాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేలా మున్సిపల్ అధికారులు సహకరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్, కౌన్సిలర్ అరవ లక్ష్మి, పట్టణ అధ్యక్షులు జిట్టవెని అరుణ్ కుమార్, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.