Take a fresh look at your lifestyle.

బీసీల ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీసే జీఓ-14 ర‌ద్దు చేయాల్సిందే

0 4

మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్

హైద‌రాబాద్ (మెట్రోన్యూస్‌):

బీసీల ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీసే జీఓ-14ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని మాజీ మంత్రి వి.శ్రీ‌నివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో కుల సంఘాలకు కేసీఆర్ అత్యంత విలువైన స్థలాలు ఇచ్చి ఆత్మగౌరవం నిలబెడితే, బీసీల ఆత్మగౌరవాన్ని జీవో-14 తో కాంగ్రెస్ ప్రభుత్వం బందీఖానాలుగా మార్చిందని విమ‌ర్శించారు. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్లో పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించిన మాజీ మంత్రి మాట్లాడుతూ, రూ.200 కోట్ల రూపాయలు ఎకరం పలికే భూములను కేసీఆర్ ఉచితంగా ఇచ్చారని, కులసంఘాలు ట్రస్టుగా ఏర్పడ్డ తర్వాతే ఆ భూములు కేటాయించారని గుర్తుచేశారు. ఇపుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాల ట్ర‌స్టుపై అధికారుల ఆజమాయిషీకి కుట్ర చేసింద‌న్నారు. బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తెలిసే ఆ జీవోను విడుదల చేశారా ? అని ప్ర‌శ్నించారు. తమ కిచ్చిన స్థలాల్లో బహుళ అంతస్తులు నిర్మించి తమ కులాల్లో విద్య, ఉద్యోగావకాశాలు పెంచుకోవాలని కులసంఘాల పెద్దలు భావించారని ఆయ‌న తెలిపారు. ప్రభుత్వ జోక్యం చేసుకునేలా జీవో 14 ఇవ్వడం బీసీలపై పిడుగు వేయడం లాంటిదేన‌ని మండిప‌డ్డారు. వెంటనే జీవో 14 ని ఉపసంహరించుకోవాలన్నారు. భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించేందుకు శ‌నివారం రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహిస్తున్నాం అని ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your email address will not be published.