Take a fresh look at your lifestyle.

సర్ ప్రక్రియలో భాగంగా ఫారాలు,ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యం

0 4

మెట్రో న్యూస్.

జిల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీలకురాలు
శ్రీదేవసేన.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఫారాలు,ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యమని నల్గొండ జిల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీలకురాలు మరియు రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్
శ్రీదేవసేన అన్నారు. కొత్తఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో తొలగింపులు ,మార్పుచేర్పులను జాగ్రత్తగా పరిశీలించి చేయాలని చెప్పారు.
మంగళవారం ఆమె నల్గొండ జిల్లా ,మునుగోడు లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 171 వ పోలింగ్ కేంద్రంలో “సర్” ప్రక్రియను పరిశీలించారు.
బిఎల్ఓ పద్మ తో ముఖాముఖి మాట్లాడుతూ సర్ ప్రక్రియ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. సర్ లో భాగంగా ఓటరు నమోదు,ఫారాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకు వచ్చిన ఫారాలు,జారీ చేసిన నోటీస్ లు గురించి అడిగారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సర్ షెడ్యూలు ధ్రువ పత్రాలు పరిశీలించిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఓటరు నమోదుకై ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు ,వాటి పరిశీలన ధ్రువ పత్రాల పరిశీలన, మ్యాపింగ్ కానీ ఓటర్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, ధ్రువపత్రాల ఆధారంగా ఇల్లిల్లు పరిశీలన, ఎలా నిర్ధారణ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఓటరు జాబితా నుండి తొలగింపులు ఏ విధంగా చేస్తున్నారని? ఒక ఓటరు కు రెండు చోట్ల ఓటు ఉన్నట్లయితే ఒకేసారి రెండు చోట్ల తొలగించకుండా ఒకచోట ఓటరు గా కొనసాగేందుకు వీలైనంతవరకు నిర్ధారణ చేసుకోవాలని చెప్పారు. ఓటరు జాబితా లో విఐపి ఓటర్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఈ వివరాలన్నీ ప్రత్యేకంగా నమోదు చేయాలని, నోటీసులు జారీ చేసిన ఓటరుకు హియరింగ్ తర్వాత ఓటరు జాబితాలో తన పేరు తిరస్కరించిన లేదా అనుమతించిన వివరాలన్నింటిని తప్పనిసరిగా తెలియజేయాలని చెప్పారు .

నోటీస్ లు జారీ చేసిన ఓటర్లకు హియరింగ్ తర్వాత తన పేరు ఓటరు జాబితాలో ఉన్నది లేనిది ఇంటికి వెళ్లి తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన చింగ్ థియాన్ మావి, చండూర్ ఆర్డీవో శ్రీదేవి ,మునుగోడు తహసిల్దార్ , ఆర్ ఐ ,తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.