(మెట్రో న్యూస్) :
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండల పరిధిలోని లింగన్నవాయి గ్రామంలో పప్పు ధాన్య పంటలపై క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు అవగాహన కల్పించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మిషన్ ఫర్ ఆత్మనిర్భారత కింద రైతులకు పప్పు ధాన్య పంటలు సాగు చేసుకుని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే విధంగా సమగ్ర పంటల యాజమాన్యం పై అవగాహన కల్పించడం అయినది. ఈ సందర్శనలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజేష్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ పనిముట్ల నిర్వహణకు సంబంధించి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండల పరిధిలోని లింగన్నవాయి రైతు వేదికలో ప్రాథమిక సహకార సంఘాలు అలంపూర్, క్యాతూరు సిబ్బంది, మహిళా సంఘాలు, రైతు ఉత్పత్తి దారుల సంఘాలు, రైతులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ మాట్లాడారు. వ్యవసాయ పనిముట్ల అద్దెకేంద్రం నిర్వహణ మార్గదర్శకాలు, వ్యవసాయ ఆధారిత పంటలకు విలువలు జోడించి విదేశాలకు ఎగుమతులు చేసి లాభాలు గడించి సంఘాల అభివృద్ధి చేసుకునే విధానములపై అవగాహన కల్పించడం అయినది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి, సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ అలంపూర్ ముక్తాదార్, సింగిల్ విండో చైర్మన్ మదిలేటి, సీఈవోలు శ్రీనివాసులు హుస్సేన్ పీరా, సహకార సంఘ సిబ్బంది సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, విస్తరణాధికారి, రైతులు పాల్గొన్నారు.