Take a fresh look at your lifestyle.

మైసూరు ద‌స‌రా ఉత్స‌వాల‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

0 10

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

ప్ర‌సిద్దిగాంచిన మైసూరు దసరా ఉత్సవాలకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. బుధ‌వారం ఉద‌యం బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ఆయ‌న మైసూరు బ‌య‌లుదేరి వెళ్లారు. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ ఆహ్వానం మేర‌కు సీఎం రేవంత్ రెడ్డి మ‌ధ్యాహ్నం నుంచి రాత్రి వ‌ర‌కు జ‌రిగే ద‌స‌రా వేడుక‌ల్లో పాల్గొంటారు. రాత్రి మైసూరులోనే బ‌స‌చేస్తారు. రాత్రికి జ‌రిగే టార్చ్‌లైట్ ప‌రేడ్‌ను ఆయ‌న వీక్షిస్తారు. ద‌స‌రా వేడుక‌ల‌కు సంబంధించి బుధ‌వారం ఆఖ‌రి రోజు. న‌వ‌రాత్రులు త‌ర్వాత విజ‌య‌ద‌శ‌మి రోజున చాముండేశ్వ‌రి అమ్మ‌వారి జంబూ స‌వారి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. మైసూరు ద‌స‌రా వేడుక‌ల‌ను తిల‌కించ‌డానికి స్థానికులతోపాటుగా దేశ‌, విదేశాల నుంచి భారీగా జ‌నం త‌ర‌లివ‌స్తారు.

చివ‌రి రోజు కార్య‌క్ర‌మాల విష‌యానికొస్తే… అంబా విలాస్ ప్యాలెస్‌లో క‌ర్ణాట‌క సీఎం ఆధ్వ‌ర్యంలో నందిధ్వ‌జ పూజ ఉంటుంది. బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారికి పుష్పార్చన కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. సాయంత్రం అంబా విలాస్ ప్యాలెస్ నుంచి బ‌న్ని మంట‌పం వ‌ర‌కు అంగరంగ వైభవంగా ఏనుగుల ఊరేగింపు సాగుతుంది. బంగారు అంబారీలో చాముండేశ్వరి అమ్మవారి ఊరేగింఉ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. పంజిన క‌వాతుతో బన్నిమంటప మైదానంలో దసరా ముగింపు కార్యక్రమం నిర్వ‌హిస్తారు. పంజిన క‌వాతు అంటే భ‌ద్ర‌తా సిబ్బంది కాగ‌డాల ప్ర‌ద‌ర్శ‌న‌. బ్యాండ్లు, డ్రోన్ షో, బాణాసంచా హైలైట్‌గా నిలుస్తాయి.

Leave A Reply

Your email address will not be published.