Take a fresh look at your lifestyle.

సిరిసిల్లలో రేవంత్ జోర్దార్ ర్యాలీ

0 19

సిరిసిల్ల (మెట్రో న్యూస్‌):

  • జై కాంగ్రెస్ నినాదాల‌తో మార్మోగిన ప‌ట్ట‌ణం
  • సీఎం పాద‌యాత్ర‌తో కాంగ్రెస్ కేడ‌ర్‌లో న‌యా జోష్‌

కేటీఆర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల ప‌ట్ట‌ణంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జోర్దార్ ర్యాలీ నిర్వ‌హించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఫూలే, నేతన్న విగ్రహాల మీదుగా రంగినేని ట్రస్ట్ పక్కన ఉన్న బహిరంగ సభా వేదిక వరకు భారీ ర్యాలీ కొన‌సాగింది. జై కాంగ్రెస్ నినాదాలతో దిక్కులు పిక్క‌టిల్లాయి. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో మూడు కిలోమీట‌ర్ల మేర సాగిన పాద‌యాత్ర నియోజ‌క‌వ‌ర్గంలోని కాంగ్రెస్ కేడ‌ర్‌లో న‌యా జోష్ నింపింది. సీఎం రేవంత్‌పై న‌ల్గొండ గ‌ద్ద‌ర్ పాడిన పాట‌లు ఒక‌వైపు… కార్య‌క‌ర్త‌ల నినాదాలు మ‌రోవైపు… ఓ గంట‌పాటు సిరిసిల్ల ప‌ట్ట‌ణం హోరెత్తిపోయింది.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ముందు వ‌రుస‌లో న‌డ‌వ‌గా… పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వెంట న‌డిచారు. ప్రభుత్వ విప్‌లు, పార్టీ శాస‌న‌స‌భ్యులు, శాస‌న‌మండ‌లి స‌భ్యులు, కార్య‌క‌ర్త‌లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సిరిసిల్లలో మొత్తం రూ.340 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అందులో సిరిసిల్లలో నేతన్న బజార్‌, సిరిసిల్లతో పాటు వేములవాడలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం, సిరిసిల్ల, కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.99.40 కోట్ల పనులు, ఇంకా రెండు ఆర్డీవో కార్యాలయాలు, నాలుగు తహసీల్దార్ కార్యాలయాలు, ఒక‌ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణాల‌కు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు, అనుబంధ యూనిట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

Leave A Reply

Your email address will not be published.