మెట్రో న్యూస్ :
ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై వివాదాస్పద పుస్తకం రచిస్తున్న హమారా ప్రసాద్‌ను అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని బుధవారం మాల మహానాడు ఆధ్వర్యంలో అచ్చంపేట పోలీస్ స్టేషన్ లోపిర్యాదు చేశారు.
భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ని కల్పిత నాయకుడుగా పేర్కొంటూ వివాదాస్పద పుస్తకం రాస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నా హమారా ప్రసాద్ అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ప్రజల గౌరవాన్ని పొందుతున్నారని, ఆయనపైఅవమానకరమైన లేదా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల సామాజికంగా ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉందని మాల మహానాడు ప్రతినిధులు పేర్కొన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజికంగా ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉన్నందున, సంబంధిత వ్యాఖ్యలను పరిశీలించి చట్టప్రకారం కేసు నమోదు చేసి హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు.అంబేడ్కర్‌ను అవమానించేలా మాట్లాడే వారిపై ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు అనిల్, పాండు, రాజమౌళి, బాల్ చంద్ర , బాబు, రాజ్ కుమార్,అంజి , పాల్గొన్నారు.