Take a fresh look at your lifestyle.

ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ మెడ‌ల్ విన్న‌ర్స్‌కు సీఎం అభినంద‌న‌లు

0 12

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్)

ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్‌లో కాంస్య ప‌త‌కం గెల్చుకున్న భార‌త మ‌హిళ‌ల జోడీ గాయ‌త్రీ గోపీచంద్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో క‌లిశారు. త‌ల్లిదండ్రులు, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, జాతీయ మాజీ ఛాంపియ‌న్ పీవీవీ ల‌క్ష్మి కూడా హాజ‌ర‌య్యారు. త్రిసా జాలీతో క‌లిసి గాయ‌త్రి ఇటీవ‌లే భార‌త్‌లో నిర్వ‌హించిన ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్ పోటీల్లో భార‌త్‌కు ఏకైక ప‌త‌కాన్ని, కాంస్యం రూపంలో అందించ‌డం తెల్సిందే. ఈ సంద‌ర్భంగా ఇద్దరు ప్లేయర్లను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు తాజాగా ప్ర‌తిష్టాత్మ‌క అర్జున అవార్డు పుర‌స్కారాల‌కు ఎంపిక‌వ్వ‌డం విశేషం. మంత్రి శ్రీధర్ బాబు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.