Take a fresh look at your lifestyle.

కేటీఆర్‌ అరెస్టు, టీషర్ట్‌ విప్పేసిన హరీశ్‌ రావు అసెంబ్లీ వద్ద బిగ్‌ ఫైట్‌..

0 7
  • కేటీఆర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌-పోలీసుల మధ్య తోపులాట
  • పలువురు నేతలు టీషర్టులు విప్పి నిరసన
  • నేతలకు గాయాలైనట్లు బీఆర్‌ఎస్‌ ఆరోపణ
  • కౌశిక్‌రెడ్డి సహా నేతలతో పోలీసుల వాగ్వాదం

తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం కాస్తా తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, హరీశ్‌ రావు సహా పలువురు పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హరీశ్‌రావు, సుధీర్‌రెడ్డి, వివేకానందరెడ్డి సహా పలువురు నేతలు టీషర్టులు విప్పేసి నిరసన తెలిపారు.

ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బ్లాక్‌ డ్రెస్‌లో అసెంబ్లీకి వచ్చారు. అయితే నల్ల దుస్తులతో లోపలికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అసెంబ్లీలోకి అనుమతించాలని డిమాండ్‌ చేశారు.

లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కేటీఆర్‌, పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు నేతలు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలకు గాయాలైనట్లు ఆ పార్టీ నాయకులు ఆరోపించారు.

హరీశ్‌రావు, సుధీర్‌రెడ్డి, వివేకానందరెడ్డి సహా పలువురు నేతలు టీషర్టులు విప్పేసి నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని నిలదీశారు. ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నించకుండా తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

టీషర్టులు ధరించడంపై పోలీసులు అభ్యంతరం చెప్పడాన్ని కూడా బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ టీషర్ట్‌ ధరిస్తే తప్పు లేనప్పుడు తమకు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని నిలదీశారు.

పిల్లలకు ఉద్యోగాలు అడిగితే విద్యార్థులపై పోలీసులు దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఇదేం పాలన? అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాజా పరిణామాలతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Leave A Reply

Your email address will not be published.