Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ సెంట్రల్ హాల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

0 9

హైదరాబాద్ (మెట్రో న్యూస్):

అసెంబ్లీలో కొత్తగా నిర్మించిన దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాలును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం ఉదయం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి సెంట్రల్ హాలును‌ లాంఛనప్రాయంగా ప్రారంభించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. శీతాకాల సమావేశాల అనంతరం సెంట్రల్ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించడం తెలిసిందే. పార్లమెంటు తరహాలో సెంట్రల్ హాల్ నిర్మాణం ఉండాలన్న సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా దీని నిర్మాణం జరిగింది. హాల్ ఆరంభం తర్వాత… అక్కడే క్యాంటీన్ సేవలు అందించారు. సీఎం, డిప్యూటీ సీఎం, శాసనసభ వ్యవహారాల మంత్రి చాంబర్లను ఈ సందర్భంగా ఆధునికీకరించడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.