Take a fresh look at your lifestyle.

హిందువులతో పాటు ముస్లింలూ కొలిచే వైష్ణవ క్షేత్రం!

0 1

నిత్యం వినిపించే పురుష సూక్తం, భిన్నంగా ఉండే మÖలమÖర్తి రూపం. హిందువులతోపాటు ముస్లింలూ కొలిచే దైవం శ్రీముష్ణం భూ వరాహస్వామి క్షేత్రంఁ. దేశంలోని ఎనిమిది స్వయంవ్యక్త క్షేత్రాల్లో ఇదీ కూడా ఒకటి. ఈ మహిమాన్విత ఆలయంలో స్వామివారు కొలువైన తీరు ఎంతో ఆసక్తికరం. మరి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ దివ్యమైన క్షేత్రం ఎక్కడ ఉంది? ఈ ఆలయానికి ఉన్న ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం.


హిందువులతో పాటు ముస్లింలూ భక్తి శ్రద్ధలతో కొలిచే ఁభూ వరాహస్వామి ఆలయంఁ తమిళనాడు, కడలూరు జిల్లాలోని శ్రీముష్ణంలో ఉంది. ఏడు అంతస్తుల రాజగోపురంతో భక్తులకు స్వాగతం పలుకుతుంది ఈ టెంపుల్. శ్రీముష్ణం క్షేత్రంలో దర్శనమిచ్చే భూ వరాహస్వామిని పూజిస్తే త్వరగా కల్యాణం జరుగుతుందని, సత్సంతానం కలుగుతుందని, భూ వివాదాలూ- వాస్తుదోషాలూ తొలగిపోతాయని, సొంతింటి కల నెరవేరుతుందని ఓ విశ్వాసం. దేశంలోని 8 స్వయంవ్యక్త వైష్ణవ క్షేత్రాలలో శ్రీముష్ణం కూడా ఒకటిగా ప్రసిద్ధిపొందింది. శ్రీరంగం, తిరుమల, వానమామలై, ముక్తినాథ్, పుష్కర్, బద్రినాథ్, నైమిశారణ్యం మిగతా స్వయంవ్యక్త క్షేత్రాలుగా పేరొందాయి.
స్థలపురాణం ఏం చెబుతుందంటే?

హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని అపహరించి, రసాతలంలోకి వెళ్లిపోయాడట. అప్పుడు భూమాత శ్రీమహావిష్ణువును ప్రార్థించడంతో స్వామి వరాహమÖర్తిగా అవతరించి, ఆ అసురుడిని సంహరించి, భూదేవిని రక్షించాడు. హిరణ్యాక్షుడు చనిపోతూ తనని అనుగ్రహించమని కోరడంతో స్వామి ఆ అసురుడిని చూసేందుకు దక్షిణంవైపు తల తిప్పాడట. తర్వాత అలాగే స్వయంభువుగా శ్రీముష్ణంలో ప్రకటితమయ్యాడనేది పురాణ కథ. అందుకే ఈ దేవాలయంలో స్వామి శిరస్సు దక్షిణంవైపు తిరిగి ఉంటే, మిగతా భాగం పశ్చిమంవైపు ఉంటుంది. స్వామి దేవేరి అయిన లక్ష్మీదేవి అంబుజవల్లిగా కొలువైన ఈ టెంపుల్ ను తంజావూరు రాజులు నిర్మించారు. హిందూ-ముస్లిం ఐక్యతకు నిదర్శనం ఈ దేవాలయం!

రాజగోపురాన్ని దాటి లోపలికి వెళ్లే భక్తులకు గర్భాలయంలో స్వామిదర్శనం ఇచ్చే తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలాగే, ఇక్కడ ఉండే పదహారు స్తంభాల మండపం, అద్దాల మండపం, పుష్కరిణి ఈ ఆలయానికి వచ్చే భక్తులను మరింత ఆకట్టుకుంటాయి. స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు ఈ పదహారు స్తంభాల మండపంలో పఠించే పురుషసూక్తం ఆలయ ప్రాంగణంలో మార్మోగుతుంది. ఇక, సంవత్సరానికి రెండుసార్లు జరిగే విశేష ఉత్సవాలు హిందూ-ముస్లిం ఐక్యతకు నిదర్శంగా నిలుస్తాయి. ఈ దేవాలయంలో కొలువైన స్వామిని ముస్లింలు వరాహ సాహెబ్‌గా పిలుస్తారిక్కడ.
ఒకానొకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించే నవాబు చర్మ సమస్యలతో బాధపడేవాడు.

ఎంతోమంది డాక్టర్లకు చూపించినా నయం కాకపోవడంతో చివరకు శ్రీముష్ణం స్వామిని దర్శించుకున్నాడట. చర్మ సమస్యలు తగ్గిపోయి, ఆరోగ్యం చేకూరడంతో ఆ నవాబు తన పేరును భూరా సాహెబ్‌గా మార్చుకోవడమే కాక, స్వామినీ వరాహ సాహెబ్‌గా పిలవడం స్టార్ట్ చేశాడట. అందుకే రథోత్సవం నిర్వహిస్తున్నప్పుడు ఆ రథానికి అలంకరించే జెండాను స్థానిక ముస్లింలే సిద్ధంచేసి ఇస్తారు. స్వామి వారికి కానుకల్ని కూడా అందిస్తారు. అలాగే, ఏటా నిర్వహించే ఊరేగింపు ఈ ప్రాంతంలోని హజ్రత్ సయ్యద్ షా రహమతుల్లా దర్గా దగ్గర కొద్దిసేపు ఆగుతుంది.

అప్పుడు ముస్లింలు వరాహ స్వామివారికి డ్రైఫ్రూట్స్, బియ్యం, కొబ్బరికాయ వంటివి సమర్పిస్తే, ఆలయ అర్చకులు పట్టు శాలువా, తులసి ఆకుల్ని దర్గాకు ఇస్తారు.
ఇంకా నవరాత్రి, దీపావళి, మకర సంక్రాంతి సమయాల్లో ముస్లింలు అర్థమండపం వరకూ వచ్చి వరహస్వామిని పూజిస్తారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, తిరుమలలో ముందుగా వరాహస్వామిని ఆరాధించాకే వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం. కానీ, ఇక్కడ మాత్రం వేంకటేశ్వరుడిని దర్శించుకున్నాకే భక్తులు వరాహమÖర్తి మందిరానికి వెళ్తారు. ఇతర దేవతలూ కొలువైన ఈ టెంపుల్‌లో రామలక్ష్మణులను మోస్తున్న హనుమంతుడినీ చూడొచ్చు.
ఎలా చేరుకోవాలంటే?
శ్రీముష్ణం దేవాలయానికి విమానంలో రావాలనుకునే భక్తులు తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్టులో దిగాలి. అక్కడి నుంచి ఈ టంపుల్‌ను చేరుకునేందుకు బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ట్రైన్‌లో రావాలనుకునేవారు తిరుచిరాపల్లి రైల్వేస్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఈ క్షేత్రానికి బస్సులు, ప్రైవేట్ వెహికల్స్‌లో వెళ్లొచ్చు.

Leave A Reply

Your email address will not be published.