Take a fresh look at your lifestyle.

గొంతునొక్కే పాలన

0 12

పాలిటెక్నిక్‌ విద్యను పరిరక్షించాలని, జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. ఓ సీఐ విద్యార్థుల గొంతు నొక్కి దారుణంగా వ్యవహరించాడు. మరో పోలీసు అధికారి అమ్మాయిలు అని కూడా చూడకుండా చేతులతో నెట్టివేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో విద్యార్థి సంఘం నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.

గొంతునొక్కే పాలన
  • ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసు దౌర్జన్యం
  • మానుకోట నిరసనలో విద్యార్థుల పీక పిసికిన సీఐ
  • బాలికలను నెట్టేసిన మరో పోలీస్‌ అధికారి
  • జీవో-97కు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమం
  • పాలిటెక్నిక్‌ విద్య పరిరక్షణకు కలెక్టరేట్ల ముట్టడి
  • ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలుచోట్ల ధర్నాలు
  • కరీంనగర్‌లో రాజీవ్‌ రహదారి దిగ్బంధం
  • నిజామాబాద్‌లో రేవంత్‌ దిష్టిబొమ్మ దహనం
  • ఇదేం పైశాచిక ప్రభుత్వం?: హరీశ్‌రావు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌, ఆగస్టు 19 : పాలిటెక్నిక్‌ విద్యను పరిరక్షించాలని, జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. ఓ సీఐ విద్యార్థుల గొంతు నొక్కి దారుణంగా వ్యవహరించాడు. మరో పోలీసు అధికారి అమ్మాయిలు అని కూడా చూడకుండా చేతులతో నెట్టివేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో విద్యార్థి సంఘం నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినదించారు. వివరాల్లోకి వెళ్తే.. పాలిటెక్నిక్‌ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నం.97ను రద్దు చేయడంతోపాటు విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తి పాలసీని వెనకి తీసుకోవాలని, పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్‌ ఇండియా సిల్‌ యూనివర్సిటీలో విలీనం చేయవద్దని విద్యార్థులు కదం తొక్కారు.

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కలెక్టరేట్‌లను ముట్టడించారు. కలెక్టరేట్‌ల ఎదుట ధర్నా చేయడంతోపాటు రహదారులు దిగ్బంధించారు. రేవంత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్‌లో కలెక్టర్‌ను కలువాలని విద్యార్థులు గేటు ఎక్కి లోపలకు వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థి సంఘం నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. టౌన్‌ సీఐ రఘుపతిరెడ్డి విద్యార్థుల గొంతు నొక్కడంతోపాటు మరో పోలీసు అధికారి అమ్మాయిలు అని కూడా చూడకుండా వారిని నెట్టివేయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనను డీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోత్‌ సాయి కుమార్‌, కోశాధికారి సూర్యప్రకాశ్‌, విద్యార్థి సంఘం నాయకులు ఖండించారు.

Students

ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్‌ కళాశాలలోని వందలాది మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం ఒకసారిగా రోడ్డెకారు. రాజీవ్‌ రహదారిని దిగ్భందించారు. ఎల్‌ఎండీ ఎస్‌ఐ అన్వర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పినప్పటికీ ఆందోళన కొనసాగించారు. రాజీవ్‌ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడడంతో విద్యార్థులను బలవంతంగా రోడ్డుపై నుంచి పకకు తొలగించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నాకు దిగారు.

నిజామాబాద్‌ జిల్లా నవీపేట, కోటగిరి తదితర ప్రాంతాల్లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నవీపేటలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ.. జీవో 97ను ద్దు చేయాలని, లేదంటే ఎమ్మెల్యే, ఎంపీల ఇండ్ల ఎదుట ధర్నా చేస్తామని, సచివాలయాన్ని ముట్టడిస్తామని, పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హకుల కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జి దారుణమని, మహబూబాబాద్‌లో విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ప్రకటనలో డిమాండ్‌ చేశారు. శక్తి సీమ్‌ వల్ల మూడేండ్లు వృథా అవుతుందని, 97 జీవో అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులపై జరుగుతున్న కుట్రగా భావిస్తున్నామని నంగారా భేరి లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడవాత్‌ రాంబల్‌నాయక్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

Students1

Leave A Reply

Your email address will not be published.