Take a fresh look at your lifestyle.

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ నిరంతర పోరాటం

0 18

-కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు, యువతకు తీవ్ర అన్యాయం..

-హామీల అమలులో ఘోర వైఫల్యం..

-జీవో 97ను వెంటనే రద్దు చేయాలి..

-ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థుల సమస్యల పరిష్కారం..

-ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మెట్రో న్యూస్ పటాన్చెరు:కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. విద్యార్థి, యువతకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు బిఆర్ఎస్ పార్టీ పక్షాన నిరంతర పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 420 మోసాల పైన బిఆర్ఎస్ పార్టీ పోరుబాటలో భాగంగా గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా విద్యార్థులతో కలిసి భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వాటి అమలులో ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రధానంగా విద్యార్థులకు 5 లక్షల రూపాయల భరోసా కార్డు, కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీ, అర్హులైన నిరుద్యోగ యువతకు ప్రతినెల రూ. 4 వేల నిరుద్యోగ భృతి, అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం.. అంశాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. జీవో నంబర్ 97 పేరుతో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థు ఆశలను అడియాశలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడకుండా, పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, విద్యార్థి, యువజన నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.