Take a fresh look at your lifestyle.

గణేష్ ఉత్సవాలపై మంత్రి పొన్నం సమీక్ష

0 9

హైదరాబాద్ : మెట్రో న్యూస్

ఎంసీ హెచ్ ఆర్ డీ లో గణేష్ ఉత్సవాలపై హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, డీజీపీ సీవీ ఆనంద్, పోలీస్ కమిషనర్లు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు భద్రత, ట్రాఫిక్, శానిటేషన్, నిమజ్జన ఏర్పాట్లు,భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు ,మండపాల నిర్వహణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

Leave A Reply

Your email address will not be published.