నాలుగు గ్రామాల్లో పార్టీ నాయకులతో సమావేశాలు.. అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేలా కార్యాచరణ
మెట్రో న్యూస్ – రాయపర్తి, నవంబర్ 4:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూచించారు.
రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని సన్నూరు, వెంకటేశ్వరపల్లి, జయరాం తండా, బాలు నాయక్ తండా గ్రామాల్లో పార్టీ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై గ్రామాల వారీగా చర్చించారు. ఓటరు నమోదుకు అర్హత కలిగిన పట్టభద్రులను గుర్తించి, వారికి నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని నాయకులు నిర్ణయించారు. ప్రతి గ్రామంలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశాల్లో రాయపర్తి మండల పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి పూస మధు, క్లస్టర్ ఇన్‌చార్జి ఐత రామ్ చందర్, మండల పార్టీ నాయకులు గాదె రవీందర్ రెడ్డి, ఆశ్రఫ్ పాషా, సంకినేని ఎల్లస్వామి పాల్గొన్నారు.
అలాగే స్థానిక పార్టీ నాయకులు పోతుల కొమురుమాళ్ళు, చిన్నపాక రాంబాబు, నలామాష సారయ్య, గూబ ఎల్లయ్య, గూబ అశోక్, చీకటి కర్ణాకర్, పయ్యాల కొమురుమాళ్ళు, వేణు, ఎనగందుల సామ్రాట్, గుగులోత్ గౌస్ నాయక్, బాలు నాయక్, బాలాజీ, పొన్నం కుమార్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.