మెట్రో ఈవినింగ్ న్యూస్
పటేల్ చిత్రపటానికి పూలమాల వేసిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ రవి
జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ
దేశ ప్రజలందరి ఏకత్వానికి ప్రతిరూపమే జాతీయ ఐక్యతా దినోత్సవం అని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో దేశ తొలి ఉప ప్రధానమంత్రి, భారత దేశ ఉక్కుమనిషి, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
జాతీయ ఐక్యతా స్ఫూర్తిని పెంపొందిస్తూ దేశ సమగ్రతను పరిరక్షించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు.
అనంతరం జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా దేశ సమైక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, కలెక్టరేట్ పరిపాలనాధికారి గౌరీ శంకర్, తహసీల్దార్లు, ఇతర అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.