మెట్రోన్యూస్ :
భూ సమస్యలపై శాశ్వత పరిష్కారానికి భూభాగ్య రిసర్వ్ ఆర్ డి ఓ రమాదేవి అన్నారు.భూముల రీ సర్వే తో రైతుల పొలం గట్ల పంచాయతీలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. శనివారం మండలంలోని భూరాన్ వాడి తండాలో భూమి రి సర్వే పై అవగాహన, గ్రామసభ నిర్వహించారు.పట్టే పొలం సర్పంచ్ సక్కుబాయి, పెద్ద తండా సర్పంచ్ సంగ్య నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భూమి రిసర్వ్ కు వచ్చే సర్వేలను రైతులు సహకరించి సర్వే చేయించుకోవాలని తెలిపారు. రెవెన్యూ గ్రామమైన బురాన్ వారి తండాలో 325 ఎకరాల భూమి ఉండగా 344 మంది రైతులు ఉన్నారని వారం రోజుల్లో సర్వే పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడం తో పాటు భూ రికార్డులు పారదర్శకత కచ్చితత్వం తీసుకురావడమే లక్ష్యం గా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా భూ భారతి భూ రీసర్వే కార్యక్రమం చేపట్టిందని ఆర్డిఓ తెలిపారు. భూముల అద్దులను కచ్చితంగా గుర్తించి ఇలాంటి తప్పుగా తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తాసిల్దార్ దత్తరెడ్డి, సమీర్ ఏడి మండల సర్వే సుల్తానా బేగం రెవెన్యూ సిబ్బంది రవి మాణిక్యం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దిగంబర్ రావు మాజీ ఎంపీటీసీ నరేందర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు పీర్యానాయక్ ఉన్నారు.