మెట్రో న్యూస్
గొల్లపల్లిలోని శ్రీలలితాంబికా తపోవనంలోమహబూబ్నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన పది రోజుల NMMS శిక్షణ శిబిరం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అపార ప్రతిభ ఉందని, సరైన శిక్షణతో ఉన్నత విజయాలు సాధిస్తారని అన్నారు. గత ఏడాది జిల్లాలో వచ్చిన 71 NMMS స్కాలర్షిప్లలో 60 ఈ శిబిరం విద్యార్థులే సాధించడంఅభినందనీయమన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసంఅలవర్చుకోవాలని,సూచించారు.కార్యక్రమంలో తపోవనం చైర్మన్ జి. భాస్కర్, గుండా మనోహర్, రవీందర్, రవీందర్ రెడ్డి, మదన్ మోహన్ యాదవ్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.