Take a fresh look at your lifestyle.

సింధు ఆదర్శ్ రెడ్డి చొరవతో కొత్తరూపు సంతరించుకున్న ఎల్‌.ఐ.జి. కాలనీ ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ

0 4

విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనకు ప్రాధాన్యం

(మెట్రో న్యూస్)

భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి చొరవతో ఎల్‌.ఐ.జి. కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆధునీకరించారు.సేల్స్‌ఫోర్స్ కంపెనీ, నిర్మాణ్ సంస్థ సహకారంతో పాఠశాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించారు.పాఠశాలలో ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులతో పాటు పెయింటింగ్, లీకేజీల మరమ్మతులు, ఫ్లోరింగ్ పనులు చేపట్టారు. చిన్నారుల ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఆర్ట్ వర్క్, ఆట పరికరాలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులను సింధు ఆదర్శ్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.పాఠశాల అభివృద్ధికి సహకరించిన సేల్స్‌ఫోర్స్ ప్రతినిధి పాండురంగారావు, నిర్మాణ్ సంస్థ సభ్యులు, సౌమ్యలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శౌర్య, రాజకుమారి, ఎల్‌.ఐ.జి. కాలనీ అధ్యక్షుడు యాదగిరి రెడ్డి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.