Take a fresh look at your lifestyle.

అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. ఒప్పందం కుదరకపోతే ఇవాళే దాడి తప్పదంటూ ట్రంప్ వార్నింగ్

0 1

అమెరికా, ఇరాన్‌ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నప్పటికీ, ఆ దేశంపై సైనిక దాడి చేసేందుకు అమెరికా ఆలోచిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో ఒప్పందం కుదిరేలా ఉన్నప్పటికీ.. ఆ నిబంధనలకు కట్టుబడి ఉంటుందా లేదా అనేదే పెద్ద ప్రశ్న అని ఆయన అన్నారు.

అణ్వాయుధాల కట్టడే లక్ష్యం 

ఇరాన్ భవిష్యత్తులో అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ చెబుతున్నారు. నార్త్‌రాప్ బి-2 స్పిరిట్ విమానాలతో చేపట్టిన గత ఎఫిక్ ఫ్యూరీ శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేదని, ఈసారి కంప్లీట్ యాక్షన్ కోసం ఆలోచిస్తున్నామని చెప్పారు. “మేము ఈ దాడి గురించి ఆలోచిస్తున్నాం, బహుశా ఆదివారం జరగవచ్చు” అని ఆయన పేర్కొన్నారు. అయితే, సైనిక చర్య లేదా దౌత్యపరమైన ఒప్పందం ఏదైనా జరగొచ్చని, ఏది జరిగినా అమెరికాదే విజయమని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

అమెరికా నిఘా వర్గాల హెచ్చరికలు 

మరోవైపు, ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమవడానికి అమెరికాయే కారణమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఆరోపించారు. ఇదే సమయంలో, పశ్చిమ ఆసియాతో పాటు ఇతర ప్రాంతాల్లోని అమెరికా సిబ్బంది, సిటిజిన్స్‌పై దాడులు చేసేందుకు ఇరాన్ ప్రయత్నాలను ముమ్మరం చేసిందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది.

మరో ఎఫిక్ ఫ్యూరీ 

ఇరాన్ పై మరో ఎఫిక్ ఫ్యూరీ ఉంటుందని ఇటీవలె అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్న్ చేశారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే ఈసారి బలమైన దాడులు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. అమెరికా దాడులకు పాల్పడితే తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ సైనిక వర్గాలు ప్రకటించాయి. పశ్చిమాసియా దేశాలపై దాడులు, ఇంటర్నెట్ కేబుళ్ల ధ్వంసంపై ఇరాన్ దృష్టి పెట్టినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు ముందు లేదా అనంతరం దాడులు జరిగే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.