Take a fresh look at your lifestyle.

వైభవంగా ఆలయ్ బలయ్ వేడుకలు.

0 7

హైదరాబాద్ : మెట్రో న్యూస్

తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, ఐక్యతను చాటిచెప్పే వేదికగా నిలిచే సాంప్రదాయ ‘ఆలయ్‌ బలయ్‌’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాంపల్లి లోని ఎగ్జీబిషన్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పండుగ చేసుకోవాలనే సదుద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

 

ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ కళారూపాలతో ప్రదర్శనలు నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలు, బోనాలు, డప్పు చప్పుళ్లు, కోలాటాలు ప్రాంగణమంతా పండుగ శోభను సంతరించుకునేలా చేశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ప్రముఖుల రాక.. ఆత్మీయ పలకరింపులు వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అందరూ ఆప్యాయంగా పలకరించుకోవడం, ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకోవడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచింది. రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో ‘ఆలయ్ బలయ్’ ఎంతో కీలకపాత్ర పోషిస్తోందని ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు.

మన సంప్రదాయాలను భావితరాలకు అందించేలా దత్తత్రేయ ఈ వేడుకను నిలకడగా కొనసాగిస్తుండడం అభినందనీయమని ప్రశంసించారు.

Leave A Reply

Your email address will not be published.