హైదరాబాద్:
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రెండు డీఏలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం నాడు 2 డీఏలు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ జీతంలో పెంచిన డీఏ ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుందని స్పష్టం చేసింది.
2024 జవనరి నుంచి ఉద్యోగుల డీఏ 37.31 శాతం, 2015 పే స్కేలు ఉద్యోగులకు డీఏ 81.72 శాతం , 2020 పేస్కేలు ఉద్యోగులకు డీఏ 40.04 శాతతం, 2016 పే స్కేలు ఉద్యోగులకు డీఏ 53 శాతానికి పెంచారు. 2006 పే స్కేలు ఉద్యోగులకు డీఏ 246 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూజీసీ, ఏఐసీఐఐ ఉద్యోగులకు సైతం ఈ ప్రయోజనాలు వర్తించనున్నాయని అధికారులు తెలిపారు.