రైతులను కానీ, ప్రజలను కానీ మీ సావు మీరు సావండి అని రేవంత్ రెడ్డి అంటుండని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఏదైనా పైసలు పెట్టి కొనొచ్చు కానీ నీళ్లు కొంటమా..? నీళ్లను కొనలేము అంటున్నడు. మరి అంత ప్రాధాన్యత కలిగిన నీళ్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నావ్. నేను మొదటి నుంచి చెబుతున్నా.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని.. దానికి ఈ రూంలో ఉన్న జర్పలిస్టులే సాక్ష్యమన్నారు.
పాపం చనిపోయిన మా పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా పోరాడిండు. దేవాదులలో నీళ్లొస్తున్నాయి.. 10 మోటార్లు నడవాల్సిన చోట మూడే మోటార్లు ఎందుకు నడుపుతున్నవ్.. ఎల్‌నినో వస్తుందంటున్నరు..3 మోటార్లు ఎందుకు నడుపతున్నవ్.. 10 మోటార్లు నడుపు.. నీళ్లు ఎత్తు. వరంగల్ జిల్లాలోని రిజర్వాయర్లు నింపు.. చెరువులు నింపు అని నేను ఇక్కడ ప్రెస్‌మీట్‌లో మాట్లాడినా.. వరంగల్ పోయి మాట్లాడినా.. మా పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా మాట్లాడారు. మా వరంగల్ జిల్లా నాయకులంతా మాట్లాడారు.. ఎత్తావా..? నువ్వు.. మరి ఆ రోజు నీళ్లు ఎందుకు ఎత్తలేదు.. చుక్క నీళ్లు రాగానే దేవాదులలో నీల్లు ఎత్తాలనే సోయి నీకు ఎందుకు లేదు. ఎల్‌నినో వస్తుందని ప్రపంచమంతా జాగ్రత్తపడుతుంటే నువ్వు ఎందుకు 10కి 10 మోటార్లు నడుపలేదని హరీశ్ రావు ప్రశ్నించారు.
మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేనడుగుతున్నా.. నువ్వు 10కి 10 మోటార్లు 24 గంటలు నడిపుంటే ఇవాళ వరంగల్‌కు కరువెక్కడిది అని హరీశ్ రావు అడిగారు. కేసీఆర్ ముందు చూపుతో సమ్మక్క బ్యారేజీని కట్టి కరువు కాలంలో సంవత్సరానికి 300 రోజులు దేవాదుల నీళ్లెత్తడానికి అనుకూలంగా ఆ ప్రాజెక్టు మేం నిర్మించినం కదా..300 రోజులు ఎత్తే అవకాశముంటే.. నువ్వు నీళ్లు వదిలిపెట్టివవు.. నువ్వు వదిలిపెడితే చంద్రబాబు ఒడిసిపట్టిండు. పట్టిసీమ ద్వారా ఇవాళ ఆంధప్రదేశ్‌లో క్రాప్ హాలీడే లేదు.. కరువు లేదు.. అంతేకాదు తెలంగాణ కంటే తక్కువ వర్షపాతం ఆంధ్రప్రదేశ్‌లో నమోదైంది.. తెలంగాణలో 12-13 శాతం ఉంటే.. ఏపీలో 25 శాతం తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. కానీ అక్కడ క్రాప్ హాలీడే లేదు.. పంటలు పండుతున్నయ్.. నీకు ఆంధ్రప్రదేశ్ కంటే వర్షాలు ఎక్కువ పడ్డా నీ చేతకాని తనం.. తెలివితక్కువ తనం వల్ల లేని కరువును ఇవాళ తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దినవ్ నువ్వు అన్నారు.